బ్రేకింగ్: అమెరికాలో తెలంగాణ విద్యార్థిపై కాల్పులు

by Disha Web |
బ్రేకింగ్: అమెరికాలో తెలంగాణ విద్యార్థిపై కాల్పులు
X

దిశ, వెబ్‌డెస్క్: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. కాలిఫోర్నియాలో జరిగిన కాల్పుల ఘటనలో 10 మంది మృతి చెందిన ఘటన మరువక ముందే.. సోమవారం చికాగోలో దుండగులు మరోసారి కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో తెలంగాణకు చెందిన సాయి చరణ్ అనే విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ఒక్కసారిగా దుండగులు చేసిన ఈ కాల్పుల్లో సాయిచరణ్‌తో మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరి శరీరాల్లోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. వెంటనే అధికారులు వీరిని ఆసుపత్రికి తరలించారు. కాల్పులకు తెగబడ్డా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. తెలంగాణకు చెందిన సాయి చరణ్‌పై కాల్పులు జరగడంతో అతడి ఫ్రెండ్స్ బాధితుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కాగా, సాయి చరణ్ చికాగోలోని గవర్నర్ యూనివర్శిటీలో చదువుతున్నాడు.


Next Story