HYD: బయట హోటల్ బోర్డు.. లోపలంతా విచ్చలవిడి శృంగారం!

by Gantepaka Srikanth |   (  Updated:2025-10-23 11:28:30  IST  )

బయట హోటల్ అని బోర్డు పెట్టారు.. లోపలంతా అశ్లీలం, అసాంఘీకం

HYD: బయట హోటల్ బోర్డు.. లోపలంతా విచ్చలవిడి శృంగారం!
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌(Banjara Hills)లో సెక్స్ రాకెట్‌(Sex Racket)ను పోలీసులు భగ్నం చేశారు. ‘ఆర్ ఇన్’ హోటల్ పేరుతో సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పక్కా ప్లాన్‌తో గురువారం పోలీసులు దాడులు చేశారు. రాకెట్ నిర్వహకుడు షరీఫ్‌తో పాటు ఏడుగురు కస్టమర్లను అరెస్ట్ చేశారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యా్ప్తు ప్రారంభించారు. పోలీసుల దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇటీవల కాలంలో ఈ తరహా ఘటనలు ఎక్కువైపోయాయి. కొన్ని రోజుల క్రితమే మెహదీపట్నంలో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు అయింది. మెహదీపట్నంలో నివాసం ఉంటున్న షహనాజ్, హజీరా అనే యువతులు హైదరాబాద్ నగరాన్ని చూపిస్తామని చెప్పి ఓ మైనర్ బాలికను బంగ్లాదేశ్ నుంచి తీసుకెళ్లారు. ఆ మహిళ హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన అనంతరం బాలికను ఓ హోటల్ గదిలో బంధించి బలవంతంగా వ్యభిచారం చేయించారు. అయితే వారి నుంచి చాకచక్యంగా తప్పించుకున్న బాలిక పోలీసులకు సమాచారం అందించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆరుగురు ముఠా సభ్యులను అరెస్టు చేశారు.

Read More: ‘సెక్స్ వార్‌ ఫేర్’.. వెన్నులో వణుకుపుట్టిస్తున్న రష్యా, చైనా స్పై

నెలకో మర్డర్.. కాంట్రాక్ట్ క్రైమ్స్... వెలుగులోకి వస్తున్న సిగ్మా గ్యాంగ్ దారుణాలు

Next Story