- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైవేపై ఘోర ప్రమాదం.. రెండు బస్సులు ఢీకొని ఏడుగురు మృతి!
గుజరాత్-మహారాష్ట్ర హైవేపై రెండు బస్సులు ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు మృతి చెందినట్లు సూరత్ రూరల్ ఎస్పీ రాజేష్ గధియా వెల్లడించారు.

దిశ, వెబ్ డెస్క్: రెండు బస్సులు ఢీకొని ఏడుగురు ప్రాణాలు కోల్పోగా మరికొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ షాకింగ్ సంఘటన గుజరాత్‌లోని సూరత్ జిల్లాలో చోటుచేసుకుంది. గుజరాత్-మహారాష్ట్ర హైవేపై బార్డోలి తహసీల్ పరిధిలో రెండు బస్సులు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ప్రమాద తీవ్రతకు ఏడుగురు ప్రయాణికులు స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం అందింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఉన్న పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలను సూరత్ రూరల్ ఎస్పీ (SP) రాజేష్ గధియా మీడియాకు వెల్లడించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా హైవేపై కాసేపు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.






