ఘోర రోడ్డు ప్ర‌మాదం.. లారీ-ఆటో ఢీ.. ఇద్ద‌రు యువ‌కులు మృతి..!

by Nallavelli.Anjaneyulu |

దిశ, రాజోలి : లారీ-ఆటో ఢీ కొన‌డంతో ఇద్ద‌రూ యువ‌కులు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందిన సంఘ‌ట‌న జోగుళాంబ గ‌ద్వాల్ జిల్లా రాజోలి మండ‌లం ప‌చ్చ‌ర్ల గ్రామంలో చోటు చేసుకుంది.

ఘోర రోడ్డు ప్ర‌మాదం.. లారీ-ఆటో ఢీ.. ఇద్ద‌రు యువ‌కులు మృతి..!
X

దిశ, రాజోలి : లారీ-ఆటో ఢీ కొన‌డంతో ఇద్ద‌రూ యువ‌కులు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందిన సంఘ‌ట‌న జోగుళాంబ గ‌ద్వాల్ జిల్లా రాజోలి మండ‌లం ప‌చ్చ‌ర్ల గ్రామంలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్లితే.. పచ్చర్ల గ్రామానికి చెందిన మహేష్ (20), విశ్వాస్ (16) టొమాటో బాక్సులతో ఆటో లో శాంతినగర్ వైపు వెళ్తుండగా.. జులకల్ వాగు వద్ద లారీ ఆటోను ఢీ కొట్టింది. దీంతో ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. స‌మాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ విషాద ఘటనతో పచ్చర్ల గ్రామంలో శోకసంద్రం అలుముకుంది. గ్రామస్తులు యువకుల అకాల మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

Next Story