- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్రామీణ ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు, పేదలే టార్గెట్..సృష్టి కేసులో వెలుగులోకి సంచలనాలు
సృష్టి కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. విచారణలో నమ్రత అనేక అక్రమాలకు పాల్పడినట్టు

దిశ, వెబ్ డెస్క్: సృష్టి కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. విచారణలో నమ్రత అనేక అక్రమాలకు పాల్పడినట్టు పోలీసులు గర్తించారు. గ్రామీణ ప్రాంతాలనే టార్గెట్ చేస్తూ ఆమె మెడికల్ క్యాంపులు నిర్వహించినట్టు తేలింది. గ్రామాల్లో పేద మహిళలను ట్రాప్ చేసి అధిక డబ్బులు ఆశ చూపుతూ చైల్డ్ ట్రాఫికింగ్‌కు పాల్పడినట్టు గుర్తించారు. అలా పసిబిడ్డలను పేద మహిళల వద్ద కొనుగోలు చేసిన అనంతరం సరోగసి ద్వారా పుట్టిందని అమాయకులను నమ్మించి లక్షల్లో డబ్బులు వసూలు చేసినట్టు గుర్తించారు.
నమ్రత చైల్డ్ ట్రాఫికింగ్‌కు పలువురు ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు సైతం సహకరించినట్టు గుర్తించారు. ఈ వ్యవహారంలో కల్యాణి ఏ3, ఏ6 సంతోషిల పాత్ర కీలకం అని పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉంటే సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసు తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా ఓ జంట బిడ్డను పొందగా సరోగసి ద్వారా పుట్టిందని డాక్టర్ నమ్రత నమ్మించారు. కానీ ఆ చిన్నారి క్యాన్సర్ బారిన పడటంతో డీఎన్ఏ టెస్ట్ నిర్వహించగా అసలు బండారం బయటపడింది. దీంతో కేసు నమోదు చేసుకుని నమ్రతను పోలీసులు విచారిస్తుండగా సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.






