ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం.. పొంగులేటి, కోమటిరెడ్డిని గట్టి దెబ్బే కొట్టారుగా!

by Gantepaka Srikanth |

ఫోన్ ట్యాపింగ్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో దర్యాప్తులో సిట్(SIT) అధికారులు వేగం పెంచారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం.. పొంగులేటి, కోమటిరెడ్డిని గట్టి దెబ్బే కొట్టారుగా!
X

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో దర్యాప్తులో సిట్(SIT) అధికారులు వేగం పెంచారు. రేపు(బుధవారం) స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచి(SIB) మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు(Prabhakar Rao) మరోసారి సిట్‌ విచారణకు హాజరు కాబోతున్నారు. ప్రభాకర్ రావుతో పాటు మరో నలుగురు నిందితులను కలిపి విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ బాధితుల వాంగ్మూలాలూ సేకరిస్తున్నారు. మంగళవారం పలువురు బాధితులు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఈ క్రమంలోనే దాదాపు 600 మంది ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు సిట్ అధికారులు నిర్ధారించారు.

2023 ఎన్నికలకు ముందు ఎక్కువమంది ఫోన్లు ట్యాప్ చేసినట్లు తెలిపారు. రాజకీయ నేతలు, జర్నలిస్టులు, సినీ ప్రముఖుల ఫోన్లే టార్గెట్‌గా ఈ తతంగం నడిపినట్లు అంచనాకు వచ్చారు. రేపు ట్యాపింగ్ గురైన వారి పేర్లు చెప్పి సిట్ అధికారులు ప్రభాకర్ రావును విచారించనున్నారు. అంతేగాకుండా.. 2023 ఎన్నికల వేళ క్రియేట్ చేసిన ‘పోల్-2023’ వాట్సాప్ గ్రూపుపైనా ఆరా తీయబోతున్నారు. ఎన్నికలప్పుడు నేతల ఫోన్లు ట్యాప్ చేసి డబ్బు స్వాధీనం చేసుకోవడంపైన కూడా ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్లు ట్యాప్ చేయడం ద్వారానే విపక్ష నేతల డబ్బుల గురించి తెలుసుకొని.. పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Ponguleti Srinivasa Reddy), కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy)ల కంపెనీల డబ్బులు పట్టుకున్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఇతర పార్టీల నేతలతో పాటు ఆరోజు అధికారంలో ఉన్న పలువురి బీఆర్ఎస్ నేతల ఫోన్లు కూడా ట్యాపింగ్‌కు గురయ్యాయని వెల్లడించారు.

Next Story