- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీసత్యసాయి జిల్లాలో సంచలనం.. ఇద్దరు ఉగ్రవాద సానుభూతిపరుల అరెస్ట్
రాష్ట్రంలో ఇటీవలే ఉగ్రవాదుల కదలికలు కలంకలం రేపిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఇటీవలే ఉగ్రవాదుల కదలికలు కలంకలం రేపిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఉగ్రవాది నూర్ మహమ్మద్ షేక్ (Noor Mohammed Sheikh)ను ధర్మవరం (Dharmavaram) పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. అతడు పాకిస్థాన్‌కు చెందిన జైషే-ఈ-మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థతో లింకులు ఉన్నట్లుగా ఇంటెలిజెన్స్ బ్యూరో(IB) గుర్తించింది. భారతదేశంలో నిషేధించిన ఉగ్రవాద సంస్థలకు చెందిన వాట్సప్ గ్రూపుల్లో అతడు సభ్యుడిగా ఉన్నట్లుగా నిర్ధారించారు. ఈ క్రమంలోనే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. విచారణలో భాగంగా నూర్ మహమ్మద్ షేక్ ఇచ్చిన సమాచారం మేరకు ధర్మవరంలో మరో ఇద్దరు ఉగ్రవాద సానుభూతిపరులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో మహారాష్ట్రకు చెందిన షేక్ అస్లాం, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందని సజ్జత్ హుస్సేన్ ఉన్నారు. ఆ ఇద్దరినీ ఉగ్రవాదం వైపు నూర్ మహమ్మద్ షేక్ ప్రేరేపించినట్లుగా పోలీసులకు వాంగ్మూలంలో చెప్పినట్లుగా తెలుస్తోంది.






