- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్ నగరంలో సంచలనం.. భారీగా రద్దయిన పెద్ద నోట్లు సీజ్
by Kema Shiva Kumar |
అవినీతిపై పోరాడేందుకు, దేశంలో నల్లధనం సమస్యలను రూపుమాపేందుకు 2016 నవంబరు 8 అర్థరాత్రి నుంచి మొదలుకుని రూ.500, రూ.వెయ్యి నోట్లను నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: అవినీతిపై పోరాడేందుకు, దేశంలో నల్లధనం సమస్యలను రూపుమాపేందుకు 2016 నవంబరు 8 అర్థరాత్రి నుంచి మొదలుకుని రూ.500, రూ.వెయ్యి నోట్లను నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇవాళ హైదరాబాద్ నగర పరిధిలో చిత్రం చోటుచేసుకుంది. నారాయణగూడలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపడుతుండగా.. ఓ ఇంట్లో 3 పెద్ద బ్యాగుల్లో రద్దు అయిన రూ.2 కోట్ల విలువైన రూ.500, రూ.వెయ్యి నోట్ల కట్టలను గుర్తించారు. ఈ మేరకు బ్యాగులతో పాటు నలుగురు అనుమానిత వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలు ఆ నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి.. ఎవరివి, అక్కడ ఎందుకు ఉన్నాయనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Next Story






