సుక్మా జిల్లాలో భద్రతా బలగాల కూంబింగ్.. మావోయిస్టుల భారీ డంప్ గుర్తింపు

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-22 06:27:59  IST  )

ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లోని సుక్మా (Sukma) జిల్లాలో మరోసారి మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.

సుక్మా జిల్లాలో భద్రతా బలగాల కూంబింగ్.. మావోయిస్టుల భారీ డంప్ గుర్తింపు
X

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లోని సుక్మా (Sukma) జిల్లాలో మరోసారి మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. CRPF 150 బెటాలియన్, జిల్లా పోలీసులు చేపట్టిన జాయింట్ కూంబింగ్ ఆపరేషన్‌లో మావోయిస్టుల అతిపెద్ద ఆయుధాల తయారీ కార్మాగారాన్ని గుర్తించి ధ్వంసం చేశారు. మీనగట్టా అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ఆయుధ కార్మాగారం ఉందనే సమాచారం మేరకు భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. ఈ మేరకు వారికి ఆయుధాల డంప్‌ అభ్యమైంది. అందులో 8 సింగిల్ షాట్ రైఫిల్స్, 12 బోర్ కార్ట్రిడ్జ్‌లు 15, ఎలక్ట్రిక్ డెటోనేటర్లు 5, కార్డెక్స్ వైర్ 30 మీటర్లు, మల్టీమీటర్ 1, సేఫ్టీ ఫ్యూజ్ 30 మీటర్లు, PEK పేలుడు పదార్థం 2 కిలోలు, ANFO పేలుడు పదార్థం 1 కిలో, అమ్మోనియం నైట్రేట్ 10 కిలోలు, వైర్‌లెస్ VHF సెట్లు 8, ఒక వెల్డింగ్ మెషిన్, ఒక కట్టర్ మెషిన్, మావోయిస్టుల యూనిఫామ్స్, యూనిఫాం తయారీ సామగ్రి, విప్లవ సాహిత్యం, అదేవిధంగా సింగిల్ షాట్ రైఫిల్ ఫ్యాక్టరీకి అవసరమైన భారీ మొత్తంలో ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా కిరణ్ చౌహన్ (Kiran Chauhan) మాట్లాడుతూ.. ఈ కార్మాగారం మావోయిస్టులు భద్రతా బలగాలపై దాడులు చేయడానికి ఆయుధాలు తయారు చేసేందుకు ఉపయోగిస్తున్నారని తెలిపారు. డంప్‌ను ధ్వంసం చేయడం వల్ల వారి కార్యకలాపాలకు, నిర్వహణకు అటకాయం ఏర్పడుతుందని అన్నారు. ఈ ఏడాది ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లు ఉధృతం చేశామని పేర్కొన్నారు. మార్చి 2026 నాటికి మావోయిస్టులను పూర్తిగా అంతం చేయాలనే లక్ష్యంతో భద్రతా బలగాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయని తెలిపారు.

Next Story