ముగ్గురు పిల్లలను చంపిన కిలాడీ లేడీ ప్రియుడు... ఇదిగో ఫోటోలు !

by velandi.Saikiran |   (  Updated:2025-04-05 11:59:50  IST  )

ముగ్గురు పిల్లలను చంపిన తల్లి, ఆమె ప్రియుడిని.. ఇవాళ జైలుకు ( Jail ) తరలించారు పోలీసులు. సంగారెడ్డి జిల్లా ( Sangareddy

ముగ్గురు పిల్లలను చంపిన కిలాడీ లేడీ ప్రియుడు... ఇదిగో ఫోటోలు !
X

దిశ, వెబ్ డెస్క్: ముగ్గురు పిల్లలను చంపిన తల్లి, ఆమె ప్రియుడిని.. ఇవాళ జైలుకు ( Jail ) తరలించారు పోలీసులు. సంగారెడ్డి జిల్లా ( Sangareddy District)అమీన్ పూర్ లో ( Aminpur) ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపింది కన్నతల్లి ( Mother). ప్రియుడి మోజులో పడి... రజిత ( Rajitha) అనే నిందితురాలు.. ఈ దారుణానికి ఓడిగట్టింది. అయితే ఈ కేసులో రజితతో పాటు ఆమె ప్రియుడు శివలను (Shiva) సంగారెడ్డి జైలుకు ఇవాళ పోలీసులు తరలించారు. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

గత మూడు రోజుల కిందట...సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లో ముగ్గురు పిల్లలతో పాటు తన భర్తను చంపాలని.. ప్రియుడు శివతో కలిసి కుట్రలు చేసింది రజిత. అయితే రాత్రి 9:30 గంటల ప్రాంతంలో... ముగ్గురు పిల్లలు విషం పెట్టిన పెరుగు అన్నం తిన్నారు. అదే సమయానికి.. వాటర్ ట్యాంకర్ నడిపే ఆమె భర్త చెన్నయ్య... మాత్రం, సడన్ ఫోన్ రావడంతో పెరుగన్నం తినకుండా బయటికి వెళ్లిపోయాడు. అయినా తగ్గకుండా పిల్లలకు... విషం పెట్టిన ఆహారం పెట్టి చంపేసింది తల్లి. తనపైన అనుమానం... రాకుండా కడుపునొప్పి అంటూ చెన్నయ్య కు ఫోన్ కాల్ చేసింది. వెంటనే ఇంటికి వచ్చిన చెన్నయ్య... రజితను ఆసుపత్రికి తరలించాడు. అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేశారు. రెండు రోజుల్లోనే అసలు నిందితులను... పట్టుకున్న పోలీసులు ఇవాళ... జైలుకు తరలించారు.

Next Story