- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం.. బంగారు ఆభరణాలు చోరీ
by Kema Shiva Kumar |
కదులుతోన్న ట్రైన్‌లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించిన ఘటన పద్మావతి ఎక్స్‌ప్రెస్ (Padmavati Express)లో ఇవాళ చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: కదులుతోన్న ట్రైన్‌లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించిన ఘటన పద్మావతి ఎక్స్‌ప్రెస్ (Padmavati Express)లో ఇవాళ చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సికింద్రాబాద్ (Secunderabad) నుంచి తిరుపతికి ప్రయాణికులతో పద్మావతి ఎక్స్‌ప్రెస్ బయలుదేరింది. ఈ క్రమంలోనే ట్రైన్ సరిగ్గా కావలి- శ్రీవెంకటేశ్వర పాలెం వద్దకు రాగానే మొత్తం మూడు బోగీల్లో దోపిడీ దొంగలు చొరబడ్డారు. అనంతరం ముగ్గురు మహిళల ఒంటిపై ఉన్న 40 గ్రాముల బంగారంతో పాటు రూ.20 వేల నగదు, ఓ సెల్‌ఫోన్ లాక్కొని అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.
Next Story






