Road Terror: రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదాలు.. ఏకంగా ఏడుగురు స్పాట్ డెడ్

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-26 02:51:49  IST  )

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రెండు వేర్వేరు ఘోర రహదారి ప్రమాదాల్లో ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.

Road Terror: రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదాలు.. ఏకంగా ఏడుగురు స్పాట్ డెడ్
X

దిశ, వెబ్‌డెస్క్: వరుస రోడ్డు ప్రమాదాలతో ఆంధ్రప్రదేశ్‌లో రహదారులు రక్తసిక్తం అయ్యాయి. ఇవాళ ఉదయం పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మాచర్ల సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని తుఫాన్ అతివేగంతో అదుపుతప్పి వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు స్పాట్‌కు చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ మేరకు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

అన్నమయ్య జిల్లాలో..

పీలేరు సమీపంలో కారు, ఆటో ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆటోలో ప్రయాణిస్తున్న మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతానికి మృతులు మెహరున్ బీ, ఆటో డ్రైవర్ ముబారక్‌, వాహిద్‌గా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయాలైన వారిని చికిత్స నిమిత్తం పీలేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతులంతా హైదరాబాద్‌ వాసులుగా గుర్తించారు. బంధువులు మృతి చెందడంతో వాహనంలో పామూరు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లుగా సమాచారం. ఈ ఘటనపై మాచర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story