- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BREAKING: నెల్లూరులో ఘోర రోడ్డుప్రమాదం.. ఏడుగురు స్పాట్ డెడ్
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. సంగం మండలం పెరమన దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. సంగం మండలం పెరమన దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. బుధవారం ఉదయం జాతీయ రహదారిపై కారును టిప్పర్ ఢీ కొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. రాంగ్ రూట్లో వెళ్లిన టిప్పర్ కారును ఢీకొన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో కారును టిప్పర్ కొంత దూరం లాక్కెళ్ళింది. కారులో ప్రయాణిస్తున్న మొత్తం స్పాట్లో చనిపోయినట్లు సమాచారం. మృతుల్లో చిన్నారి ఉన్నట్లు తెలుస్తోంది. కారు నుజ్జు నుజ్జవ్వగా.. మృతదేహాలు చిధ్రమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో మరణించిన వారిని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేశారు. కాగా.. ప్రమాదంలో మరణించిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంత్రి ఆనం ప్రమాద ఘటనపై అధికారులను ఆరా తీశారు. నేషనల్ హైవే 4 లైన్ రోడ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని సూచించారు.






