కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. పూర్తిగా దగ్ధం అయిన లారీ

by Ajay Maddhiboyina |

కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెద్దకడబూరు మండలం పులికనుమ బస్టాండ్ దగ్గర బండల లోడుతో వెళుతున్న లారీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో లారీ పూర్తిగా కాలిపోయింది.

కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. పూర్తిగా దగ్ధం అయిన లారీ
X

దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెద్దకడబూరు మండలం పులికనుమ బస్టాండ్ దగ్గర బండల లోడుతో వెళుతున్న లారీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో లారీ పూర్తిగా కాలిపోయింది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్, క్లీనర్ బయటకు దూకడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదానికి గురైన లారీ తాండూరు నుండి కేరళకు వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. ఇక ఇదే నెలలో కర్నూలు జిల్లాలో ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురై మంటలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 19మంది మరణించారు. ఆ తరవాత కూడా జిల్లాలో వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

Next Story