Road Accident: రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ఇద్దరు దుర్మరణం

by Kema Shiva Kumar |   (  Updated:2025-04-24 05:19:50  IST  )

రోడ్డు ప్రమాదం (Road Accident)లో ఇద్దరు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా (Mahabubabad District)లో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది.

Road Accident: రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ఇద్దరు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదం (Road Accident)లో ఇద్దరు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా (Mahabubabad District)లో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని కొత్తగూడ (Kothaguda) మండల పరిధిలోని పెగడపల్లి (Pegadapally) వద్ద ఎదురుగా వస్తున్న ఆటో అతివేగంగా అదుపతప్పి బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story