- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కార్మిక నాయకులను బలి తీసుకున్న రోడ్డు ప్రమాదం
గాధిర్యాల్ గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకుడు చిన్న హనుమయ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

దిశ, మహమ్మదాబాద్ : మహబూబ్‌నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలం గాధిర్యాల్ గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకుడు చిన్న హనుమయ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో మంగళవారం మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. సర్పంచ్ మాణిక్యమ్మ, మాజీ సర్పంచ్ వెంకటరాం రెడ్డి ఆధ్వర్యంలో రూ.20 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి కురుమూర్తి,అంబేద్కర్ సంఘం నాయకుడు బోరు కృష్ణయ్య, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు గాలెన్న, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా, చిన్న హనుమయ్య మృతి పట్ల సీఐటీయు నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.సోమవారం నంచర్ల గేటు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందగా, మంగళవారం గాధిర్యాల్ గ్రామంలో వేలాది మంది కార్మికుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి మాట్లాడుతూ చిన్న హనుమయ్య కార్మిక వర్గం కోసం నిరంతరం కృషి చేసిన నాయకుడని కొనియాడారు. మండలంలోని గ్రామాల్లో కార్మికుల సమస్యల పరిష్కారానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన మృతి కార్మిక వర్గానికి తీరని లోటని తెలిపారు. అనంతరం నిర్వహించిన సంతాప సభలో నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వరద గాలెన్న, గండీడ్ మండల అధ్యక్షుడు గుమ్మడాల చెన్నయ్య తదితరులు కూడా ఆయన సేవలను కొనియాడుతూ సంతాపం తెలిపారు.






