HYD: కొండాపూర్‌లో రేవ్ పార్టీ భగ్నం.. ఏపీకి చెందిన 11 మంది అరెస్ట్

by Gantepaka Srikanth |

హైదరాబాద్‌లో భారీ రేవ్ పార్టీని(Rave Party) ఎక్సైజ్ పోలీసులు భగ్నం చేశారు.

HYD: కొండాపూర్‌లో రేవ్ పార్టీ భగ్నం.. ఏపీకి చెందిన 11 మంది అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో భారీ రేవ్ పార్టీని(Rave Party) ఎక్సైజ్ పోలీసులు భగ్నం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. శనివారం రాత్రి కొండాపూర్‌లోని ఎస్వీ నిలయం అనే సర్వీస్ అపార్ట్మెంట్లో ఏపీకి చెందిన కొందరు వీకెండ్ సందర్భంగా సర్వీస్ అపార్ట్మెంట్లో రేవ్ పార్టీలు నిర్వహించారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేసి భగ్నం చేశారు. ఏపీకి చెందిన 11 మందిని అరెస్ట్ చేశారు. విజయవాడకు చెందిన నాయుడు అలియాస్ వాసు, శివం రాయుడు అనే కొంతమంది గుట్టుచప్పుడు కాకుండా ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి.. ఏపీలో డబ్బున్న వాళ్లను హైదరాబాద్‌కు తీసుకొచ్చి.. ప్రతీ వీకెండ్‌లో ఎంజాయ్ చేయించి తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. వీరి వద్ద నుంచి 2.080 కేజీల గంజాయి, 50 ఓజీ కుష్ గంజాయిని, 11.57 గ్రాముల మ్యాజిక్ ముష్రూమ్‌ను, 1.91 గ్రాముల డ్రగ్స్(Drugs) స్వాధీనం చేసుకున్నారు.

అరెస్ట్ అయిన వారిలో కింగ్ కెన్ షేర్ రాహుల్, ఆర్గనైజర్లు ప్రవీణ్ కుమార్ అలియాస్ మన్నే, అప్పికోట్ల అశోక్ కుమార్, సమ్మెల సాయి కృష్ణ, హిట్ జోసఫ్, తోట కుమారస్వామి, అడపా యశ్వంత్, శ్రీదత్, నంద, సమతా, తేజ ఉన్నారు. వీరితో పాటు మరో ముగ్గురుపై కూడా కేసు నమోదు చేశారు. వారు పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు.

Next Story