- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాన్పూర్‌లో దారుణం.. నోట్లో గుడ్డలు కుక్కి.. 14ఏళ్ల బాలికపై నలుగురు అత్యాచారం..
ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లో దారుణం చోటు చేసుకుంది. 14ఏళ్ల మైనర్ గర్ల్‌పై గ్యాంగ్ రేప్ ఘటన స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. పొలంలో పనికోసం వెళ్లిన పాపపై నలుగురు యువకులు అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది. బాధితురాలి

X
దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లో దారుణం చోటు చేసుకుంది. 14ఏళ్ల మైనర్ గర్ల్‌పై గ్యాంగ్ రేప్ ఘటన స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. పొలంలో పనికోసం వెళ్లిన పాపపై నలుగురు యువకులు అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది. బాధితురాలి తండ్రి పోలీసులను ఆశ్రయించగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. దీపు యాదవ్, రవీంద్ర యాదవ్, భోలా యాదవ్, ఇక్కు యాదవ్ ఈ ఘాతుకానికి ఒడిగట్టారని.. వీరంతా హిరావాడ గ్రామానికి చెందిన వారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన కూతురిని కిడ్నాప్ చేసి అడవుల్లోకి తీసుకెళ్లారని.. నోట్లో గుడ్డలు కుక్కి.. రేప్ చేశారని తెలిపాడు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉండగా.. పోలీసులు వెతుకుతున్నారు.
Next Story






