Rape: నగరంలో మరో దారుణం.. జర్మనీ యువతిపై గ్యాంగ్ రేప్

by Kema Shiva Kumar |   (  Updated:2025-04-01 04:29:53  IST  )

విదేశీ యువతిపై యువకులు గ్యాంగ్‌రేప్‌‌కు పాల్పడిన అమానుష ఘటన నగరంలో పహాడీషరీఫ్ పీఎస్ పరిధిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది.

Rape: నగరంలో మరో దారుణం.. జర్మనీ యువతిపై గ్యాంగ్ రేప్
X

దిశ, వెబ్‌డెస్క్: విదేశీ యువతిపై యువకులు గ్యాంగ్‌రేప్‌‌ (Gang Rape)కు పాల్పడిన అమానుష ఘటన నగరంలోని పహాడీషరీఫ్ పీఎస్ (Pahadi Sharif PS) పరిధిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున్న జర్మనీ దేశానికి చెందిన యువతిపై కారు వెళ్తున్న కొంతమంది ఆకతాయిలు కన్నేశారు. ఈ క్రమంలోనే మీర్‌పేట్ (Meerpet) ప్రాంతంలోని మందమల్లమ్మ సెంటర్ (Manda Mallamma Center) వద్ద లిఫ్ట్ ఇస్తామంటూ సదరు యువతిని నమ్మించి కారులో ఎక్కించుకున్నారు. అనంతరం ఆమెపై కారులోనే యువకులు ఒక్కొక్కరు వంతువారీగా అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆ జర్మనీ యువతి నేరుగా పహాడీ షరీఫ్ పీఎస్‌(Pahadi Sharif PS)కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రెండు బృందాలుగా విడిపోయి నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story