- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరద కాలువలో పడి యువకుడు మృతి.. రామడుగులో విషాదఛాయలు
by Bhanu |
రామడుగు మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ ఇర్ఫాన్ అనే యువకుడు వరద కాలువలో ప్రమాదవశాత్తు పడి

X
దిశ, రామడుగు - గంగాధర: రామడుగు మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ ఇర్ఫాన్ అనే యువకుడు వరద కాలువలో ప్రమాదవశాత్తు పడి మృతిచెందిన సంఘటన సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, ఇర్ఫాన్ తన స్నేహితులతో కలిసి చేపలు పట్టేందుకు గంగాధర్ మండలంలోని కొండన్నపల్లి శివారులో ఉన్న వరద కాలువ వద్దకు వెళ్లాడు. అప్పటికే చీకటి వేళ కావడంతో తడబాటు ఏర్పడి ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయినట్లు సమాచారం.
స్థానికుల కథనం ప్రకారం, ఇర్ఫాన్‌కు ఈత వచ్చిందని తెలిసినప్పటికీ, ప్రమాదం ఎలా జరిగిందన్నది తెలియక అపార్థం ఏర్పడింది. సంఘటనపై పూర్తి స్థాయిలో వివరాలు తెలియవలసి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ అనూహ్య మరణం రామడుగులో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
Next Story






