TG: తీవ్ర విషాదం.. పెళ్లిరోజే రైల్వే ఉద్యోగి మృతి

by Gantepaka Srikanth |

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు రైల్వే స్టేషన్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది.

TG: తీవ్ర విషాదం.. పెళ్లిరోజే రైల్వే ఉద్యోగి మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు రైల్వే స్టేషన్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. రైల్వే సిగ్నల్ విభాగంలో ఈఎస్ఎం (ESM)గా పనిచేస్తున్న రంప నవీన్ (33) విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు, నవీన్ తనకు కొత్తగా కొనుగోలు చేసిన కారును నిలిపేందుకు పాత రన్నింగ్ రూమ్ వద్ద ఉన్న షెడ్డు పీకుతున్న సమయంలో అక్కడ ఉన్న విద్యుత్ వైర్ తగలడంతో ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఈరోజు సాయంత్రం సుమారు నాలుగు గంటల ప్రాంతంలో జరిగింది. విద్యుత్ షాక్‌కు గురైన నవీన్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.

అత్యంత విషాదకరమైన విషయం ఏమిటంటే, ఈరోజే నవీన్ పెళ్లిరోజు కావడం స్థానికులను మరింత కలిచివేసింది. మరోవైపు ఆయన భార్య ఆరు నెలల గర్భవతిగా ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మణుగూరు రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అధికారులు ఘటనపై మరింత సమాచారం సేకరిస్తున్నారు.

Next Story