- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అత్తా కోడళ్ల మధ్య గొడవ.. అత్త ఆత్మహత్య..!
దిశ, భిక్కనూరు : అత్తా కోడళ్ళ మధ్య జరిగిన గొడవతో తీవ్ర మనస్థాపానికి గురై అత్త ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి లక్ష్మీ నగర్ తండాలో చోటుచేసుకుంది.

దిశ, భిక్కనూరు : అత్తా కోడళ్ళ మధ్య జరిగిన గొడవతో తీవ్ర మనస్థాపానికి గురై అత్త ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి లక్ష్మీ నగర్ తండాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. లక్ష్మీనగర్ తండాకు చెందిన శోభ(57)కు తన కోడలు తో గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. తాజాగా మళ్లీ గొడవ జరగడంతో మనస్థాపానికి గురైన అత్త.. ఇంట్లో ఎవరు లేని సమయంలో దూలానికి చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న శోభను కిందికి దించి అంబులెన్స్ కు సమాచారం అందించారు. వెంటనే 108 అంబులెన్స్ లో వైద్య చికిత్స నిమిత్తం కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి షిఫ్ట్ చేస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించినట్లు ఎస్ఐ ఆంజనేయులు వివరించారు.






