- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళా ఉద్యోగినిపై అత్యాచారం కేసు: పోలీసుల రహస్య విచారణ
పల్నాడు జిల్లా మాచర్లలో సంచలనం సృష్టించిన ప్రభుత్వ మహిళా ఉద్యోగిని అత్యాచారం కేసులో పోలీసులు వేగంగా దర్యాప్తు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: పల్నాడు జిల్లా మాచర్లలో సంచలనం సృష్టించిన ప్రభుత్వ మహిళా ఉద్యోగిని అత్యాచారం కేసులో పోలీసులు వేగంగా దర్యాప్తు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని రాజుపాలెంకు చెందిన శ్రీనివాస్‌గా పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు, అందులోని ఫుటేజీ ఆధారంగా నిందితుడి కదలికలను ట్రాక్ చేశారు. దీని ద్వారానే శ్రీనివాస్‌ను గుర్తించి, రహస్యంగా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ దారుణానికి అతడు ఒంటరిగా పాల్పడ్డాడా లేదా మరెవరైనా సహకరించారా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. గత గురువారం మాచర్లలో ఒంటరిగా నివసిస్తున్న ప్రభుత్వ మహిళా ఉద్యోగిని ఇంట్లోకి, మంచి నీళ్ల నెపంతో నిందితుడు ప్రవేశించాడు. కత్తితో బెదిరించి, ఆమె కాళ్లు, చేతులు కట్టేసి అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ప్రస్తుతం బాధితురాలు గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
ప్రభుత్వం, పోలీసుల స్పందన..
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. నిందితుడిని వెంటనే పట్టుకుని, కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అదనపు ఎస్పీ నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, క్లూస్ టీమ్స్ సేకరించిన ఆధారాలతో పోలీసులు కేసును ఛేదించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, బాధితురాలికి న్యాయం చేయాలని స్థానికులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.






