ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధం.. 20 మందికిపైగా సజీవ దహనం!

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-24 09:03:47  IST  )

రోడ్డు ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు సజీవ దహనమైన ఘటన కర్నూలు జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది.

ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధం.. 20 మందికిపైగా సజీవ దహనం!
X

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదంలో 20 మందికిపైగా ప్రయాణికులు సజీవ దహనమైన ఘటన కర్నూలు జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జాతీయ రహదారి 44పై హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు (OD 01 N 9490) కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద బైక్‌ను ఢీకొట్టింది. అయితే, ప్రమాదానికి గురైన బైక్ ఏకంగా బస్సు కిందికి వెళ్లి ఆయిల్ ట్యాంకును తాకి నిప్పురవ్వలు ఎగసిపడటంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో పలువురు సజీవదహనం అయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో 39 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం.

అయితే, 12 మంది ప్రయాణికులు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్‌ను బ్రేక్ చేసి స్వల్ప గాయాలతో బయటపడగా.. 20 మందికి పైగా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హుటాహుటిన స్పాట్‌కు వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని కర్నూలు సర్వజన ఆసుపత్రికి తరలించారు. అయితే, ప్రయాణికుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ నగరానికి చెందిన వారు ఉన్నట్లుగా సమాచారం. ఈ ఘోర ప్రమాదం నుంచి మృత్యుంజయులుగా బయటపడిన వారిలో జయసూర్య, రామిరెడ్డి, అకీరా, వేణుగోపాల్ రెడ్డి, హరిక, సత్యనారాయణ, శ్రీలక్ష్మి, నవీన్ కుమార్, అఖిల్, జస్మిత, రమేశ్, సుబ్రమణ్యం ఉన్నారు.

బస్సులో ప్రయాణిస్తున్న వారు వీరే..

అశ్విన్‌రెడ్డి (36), జి.ధాత్రి(27), కీర్తి(30), పంకజ్‌(28), యువన్‌ శంకర్‌రాజు (22), తరుణ్‌(27), ఆకాశ్‌(31), గిరిరావు (48), బున సాయి(33), గణేశ్‌(30), జయంత్‌ పుష్వాహా (27), పిల్వామిన్‌ బేబి (64), కిశోర్‌ కుమార్ (41) రమేష్‌(30) అతడి ముగ్గురు కుటుంబ సభ్యులు, అనూష(22), మహ్మద్‌ ఖైజర్‌ (51), దీపక్‌ కుమార్‌ (24), అన్డోజ్‌ నవీన్‌కుమార్ (26), ప్రశాంత్‌ (32), ఎం.సత్యనారాయణ(28), మేఘనాథ్‌ (25), వేణు గుండ (33), చరిత్ (21), చందన మంగ (23), సంధ్యారాణి మంగ (43), గ్లోరియా ఎల్లెస శ్యామ్ (28), సూర్య(24), హారిక (30), శ్రీహర్ష (24), శివ (24), శ్రీనివాస రెడ్డి (40), సుబ్రహ్మణ్యం (26), కె.అశోక్‌ (27), ఎం.జి.రామారెడ్డి (50), ఉమాపతి (32), అమృత్‌ కుమార్ (18), వేణుగోపాల్‌రెడ్డి (24) ఉన్నారు.

Read More: కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం.. అధికారులకు CM చంద్రబాబు కీలక ఆదేశాలు

కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎస్పీ విక్రాంత్ పాటిల్ కీలక ప్రకటన

కావేరి ట్రావెల్స్ బస్సు దగ్ధం.. సీఎం రేవంత్ దిగ్భ్రాంతి

బస్సు ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన మంత్రి నారా లోకేష్

కర్నూలు బస్సు ప్రమాదం.. ప్రయాణికుల పూర్తి జాబితా ఇదే!

మృత్యు రహదారి నేషనల్ హైవే 44..! సరిగ్గా 12 ఏళ్ల తర్వాత ‘పాలెం’ ఘటన రిపీట్

Next Story