- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెండేళ్ల బాలుడి గన్ ఫైర్.. ప్రెగ్నెంట్ గా ఉన్న తల్లి మృతి
by Javid Pasha |
అమెరికాలో దారుణం జరిగింది.. రెండేళ్ల పిల్లవాడు తన తండ్రి డెస్క్ నుంచి తుపాకీని తీసుకొని ఆడుతుండగా అది ఫైర్ అయింది.

X
నార్ వాక్ (అమెరికా) : అమెరికాలో దారుణం జరిగింది.. రెండేళ్ల పిల్లవాడు తన తండ్రి డెస్క్ నుంచి తుపాకీని తీసుకొని ఆడుతుండగా అది ఫైర్ అయింది. అది ఆటబొమ్మే అనుకొని 12 రౌండ్లు ఫైర్ చేశాడు. దీంతో తుపాకీ బుల్లెట్లు.. అక్కడే ఉన్న ఆ బాలుడి తల్లి (31) వీపు భాగం నుంచి శరీరంలోకి చొచ్చుకువెళ్లాయి. ఆమె వెంటనే పోలీసులకు కాల్ చేసింది.. హెల్ప్ చేయమని అడిగింది.. పోలీసులు హుటాహుటిన వచ్చి రక్తమోడుతున్న ఆమెను ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రికి తీసుకెళ్లే సరికే ఆమె కడుపులో ఉన్న బిడ్డ చనిపోయింది. ఆక్సిజన్ అందక కడుపులోని బిడ్డ ప్రాణాలు విడిచిందని డాక్టర్స్ తెలిపారు. ఈ వార్త విన్న బాధిత మహిళ కూడా 3 గంటల తర్వాత కన్నుమూసింది. మృతిచెందిన మహిళను ఒహియో రాష్ట్రంలోని నార్ వాక్ సిటీకి చెందిన లారా ఇల్గ్ గా గుర్తించారు.
Next Story






