- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వీడిన మహిళ మిస్సింగ్ మిస్టరీ.. పీలేరులో ఓ యువకుడి ఇంట్లో గుర్తింపు
భర్తను కోల్పోయి మూడేళ్ల చిన్నారితో ఒంటరిగా ఉంటున్న మహిళ మిస్సింగ్ మిస్టరీ వీడింది. పది రోజులకు పైగా తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ కేసును దేవీపట్నం పోలీసులు చాకచక్యంగా ఛేదించారు.

దిశ, దేవీపట్నం: భర్తను కోల్పోయి మూడేళ్ల చిన్నారితో ఒంటరిగా ఉంటున్న మహిళ మిస్సింగ్ మిస్టరీ వీడింది. పది రోజులకు పైగా తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ కేసును దేవీపట్నం పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. మంగళవారం తల్లీకూతురిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనంతరం ఎస్ఐ షరీఫ్ మీడియాకు వివరాలను వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. దేవీపట్నం మండలంలోని ఇందుకూరు గ్రామానికి చెందిన మదనపురి శ్రావణి (26), ఆమె మూడేళ్ల కుమార్తె సాయి పల్లవితో కలిసి ఈ నెల 8న ఇంటి నుంచి వెళ్లిపోయింది. వారి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఎక్కడా వెతికినా లాభం లేకుండా పోయింది. దీంతో శ్రావణి తల్లి దేవీపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన ఎస్ఐ షరీఫ్ క్రైం నంబర్ 23/2026 కింద మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ క్రమంలో అన్నమయ్య జిల్లాలోని పీలేరు ప్రాంతంలో శ్రావణి తన కూతురుతో ఉన్నట్టు సమాచారం అందింది. వెంటనే ఎస్ఐ షరీఫ్ ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఇద్దరిని దేవీపట్నం పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. విచారణ అనంతరం తల్లీకూతురిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా, శ్రావణికి కొన్నాళ్ల క్రితం వివాహమై భర్తను కోల్పోయింది. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న శ్రావణి మరో వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో వెళ్లినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. కానీ రెండో వివాహానికి శ్రావణి తల్లి అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇంట్లో నుంచి పీలేరులో ఉన్న ఓ యువకుడి దగ్గరకు వెళ్లిందని ఎస్ఐ షరీఫ్ వెల్లడించారు. ఈ సందర్భంగా శ్రావణితోపాటు ఆమె తల్లికి ఎస్ఐ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.






