- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BREAKING: మదనపల్లి చిన్నారి హత్యాచార నిందితుడి ఆత్మహత్య?
మదనపల్లిలో ఏడేళ్ల బాలిక హత్యాచారం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుడు కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: మదనపల్లిలో ఏడేళ్ల బాలికపై హత్యాచార ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. కేసులో ప్రధాన నిందితుడైన కులవర్ధన్ ఓ చెరువులో శవమై తేలాడు. అన్నమయ్య జిల్లా కురబల కోట మండలం కనసానివారిపల్లి గ్రామంలో ఉన్న చెరువులో ఓ వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ముదివేడు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని చెరువులో నుంచి బయటికి తీసి, మృతుడిని కులవర్ధన్ గా గుర్తించారు. అనంతరం డెడ్ బాడీని మదనపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనుమానిస్తున్నారు. మరోవైపు కులవర్ధన్ ఇంటివద్ద పోలీసులు బందోబస్త్ ఏర్పాటు చేశారు. కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడా ? లేక ఎవరైనా హత్య చేశారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ముగిసిన బాలిక అంత్యక్రియలు
మరోవైపు బాలిక మృతదేహానికి పోస్టుమార్టం పూర్తవ్వగా.. స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. కడప జిల్లా రాగిమానిదిన్నెపల్లెలో భారీ బందోబస్త్ నడుమ బాలిక అంత్యక్రియలు ముగిశాయి.






