- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: గంజాయి చాక్లెట్ల కలకలం
గంజాయి(Ganja) రహిత రాష్ట్రంగా మార్చేందుకు ఒకవైపు పోలీసులు నిత్యం కృషి చేస్తుంటే.. మరోపక్క విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు జరుగుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: గంజాయి(Ganja) రహిత రాష్ట్రంగా మార్చేందుకు ఒకవైపు పోలీసులు నిత్యం కృషి చేస్తుంటే.. మరోపక్క విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు జరుగుతున్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం(IDA Bollaram)లో గంజాయి చాక్లెట్ల కలకలం సృష్టించాయి. జిన్నారం మండలం బొల్లారంలో పాన్‌షాపులో విక్రయాలను పోలీసులు అడ్డుకున్నారు. ఒడిశాకు చెందిన అజయ్‌కుమార్ అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 238 గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా టాస్క్‌ఫోర్స్ బృందాలు, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం, సివిల్ పోలీసులు నిత్యం తనిఖీలు నిర్వహిస్తున్నారు. గంజాయి, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారు. గంజాయిని అక్రమంగా రవాణా చేసినా, విక్రయించినా వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఒడిశా, గోవా, ఆంధ్రప్రదేశ్‌లోని మన్యం ప్రాంతాల నుంచి ఎండు గంజాయి, మత్తు చాక్లెట్లు, మాదక ద్రవ్యాలు తీసుకొచ్చి విక్రయాలు జరుపుతున్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.






