జూబ్లీహిల్స్‌ పరిధిలో పోలీసుల తనిఖీలు.. భారీగా మద్యం పట్టివేత

by Kema Shiva Kumar |

ఉప ఎన్నికల నేపథ్యంలో జూబ్లీహిల్స్ (Jubilee Hills) నియోజకవర్గ పరిధిలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది.

జూబ్లీహిల్స్‌ పరిధిలో పోలీసుల తనిఖీలు.. భారీగా మద్యం పట్టివేత
X

దిశ, వెబ్‌డెస్క్: ఉప ఎన్నికల నేపథ్యంలో జూబ్లీహిల్స్ (Jubilee Hills) నియోజకవర్గ పరిధిలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. పోటీలో ఉన్న ప్రధాన పార్టీలు ఓటర్లను డబ్బు, మద్యంతో మభ్యపెట్టే అవకాశం ఉండటంతో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే ఎక్సైజ్ సీఐ భిక్షారెడ్డి, ఎస్సై బాలరాజు, సిబ్బంది కలిసి బోరబండలోని పలు ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. అయితే, ఇద్దరు మహిళలు సంచుల్లో మద్యం సీసాలు పెట్టి అమ్మకాలు కొనసాగిస్తుండగా వారిని రెడ్‌హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు వారి నుంచి 173 మద్యం బాటిళ్లు, బీరు బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితులు ఈశ్వరమ్మ, మరియాలను కేసు నమోదు చేసి అమీర్‌పేట్ ఎక్సైజ్‌ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Next Story