- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోక్సో కేసులో నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష
పోక్సో చట్టం కింద నమోదు చేసిన కిడ్నాప్, లైంగిక దాడి కేసులో నిందితుడు షేక్ అన్వర్ అలియాస్ కట్ట అన్వర్‌కు..

దిశ, సుల్తానాబాద్: పోక్సో చట్టం కింద నమోదు చేసిన కిడ్నాప్, లైంగిక దాడి కేసులో నిందితుడు షేక్ అన్వర్ అలియాస్ కట్ట అన్వర్‌కు పెద్దపల్లి ఫాస్ట్ ట్రాక్ కోర్టు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.2,000 జరిమానా విధించింది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తును పూర్తి చేసి కోర్టులో నేరం రుజువయ్యేలా చేసిన పోలీసులను కమిషనర్ అంబర్ కిషోర్ ఝ ప్రశంసించారు.
సుల్తానాబాద్‌కు చెందిన యువతి ఇంటర్ చదివిన తరువాత ఇస్తారాకుల షాపులో పని చేస్తూ జీవనం సాగిస్తోంది. ఇదే సమయంలో షేక్ అన్వర్ అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. కొద్దిరోజుల్లోనే అన్వర్ ప్రేమిస్తున్నానంటూ మాయమాటలు చెప్పి, 2018లో అమ్మాయిని ఇంటికి వచ్చి ఆటోలో అపహరించాడు. అనంతరం ఆమెను పెద్దపల్లికి తీసుకెళ్లి, అక్కడి నుంచి ట్రైన్ ద్వారా కాగజ్ నగర్‌లో ఓ తనకు పరిచయమున్న వారి ఇంట్లో ఉంచాడు.
అక్కడి వారిని మభ్యపెట్టి “ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను” అని నమ్మబలికిన అన్వర్, అద్దెకు ఒక రూమ్ తీసుకొని బాలికపై వారం రోజుల పాటు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను పెళ్లి చేసుకోవాలన్న విజ్ఞప్తిని అతడు పట్టించుకోలేదు. చివరికి బాలిక తన తల్లికి ఫోన్ ద్వారా సమాచారం అందించగా, కుటుంబ సభ్యులు కాగజ్ నగర్‌కు వెళ్లి ఆమెను తీసుకొచ్చారు.
బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్సై రాజేష్ కేసు నమోదు చేశారు. తరువాతి దర్యాప్తును ఏసీపీ హబీబ్ ఖాన్ చేపట్టి అన్వర్‌ను అరెస్ట్ చేశారు. ఏసీపీ వెంకట రమణారెడ్డి ఛార్జ్‌షీట్ దాఖలు చేయగా, ఫాస్ట్ ట్రాక్ కోర్టు జడ్జి విచారణ జరిపి అన్వర్ నేరం చేసినట్లు రుజువు చేశారు.
నేరాన్ని తీవ్రంగా పరిగణించిన కోర్టు 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.2,000 జరిమానా విధించింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాదాం రమేష్ కీలకంగా వాదనలు వినిపించి, సాక్ష్యాలను సమర్పించి కేసులో విజయవంతం సాధించారు. ఈ కేసు ఛేదనలో కీలకపాత్ర పోషించిన సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, ఎస్సై శ్రావణ్ కుమార్, కోర్టు కానిస్టేబుళ్లు శ్రీనివాస్, కోటేశ్వరరావును జిల్లా పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.






