హైదరాబాద్‌లో దారుణం..పెంపుడు కుక్క మర్మాంగాలపై దాడి చేయడంతో వ్యక్తి మృతి

by Ajay Maddhiboyina |

హైద‌రాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. పెంపుడు కుక్క దాడి చేయడంతో వ్యక్తి చనిపోయాడు.

హైదరాబాద్‌లో దారుణం..పెంపుడు కుక్క మర్మాంగాలపై దాడి చేయడంతో వ్యక్తి మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : హైద‌రాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. పెంపుడు కుక్క దాడి చేయడంతో వ్యక్తి చనిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీకి చెందిన పవన్ కుమార్ (37) గత ఐదేళ్లుగా తన స్నేహితుడితో కలిసి మధురానగర్‌లో నివాసం ఉంటున్నాడు. పవన్ ఓ ప్రైవేటు కంపెనీలో క్యాషియర్‌గా ఉద్యోగం చేస్తుండగా గత కొద్దిరోజులుగా అనారోగ్యం కారణంగా ఆఫీసుకు వెళ్లడం లేదు. ప్రతిరోజూ స్నేహితుడితో వాకింగ్ వెళ్లే పవన్ శనివారం రాత్రి కూడా వాకింగ్ వెళ్లి వచ్చి పడుకున్నాడు. ఉదయం పవన్ ఫోన్ ఎత్తకపోవడంతో డోర్ కొట్టారు.

అయినా తీయకపోవడంతో అతడి స్నేహితుడు చుట్టుపక్కల వారిని పిలిచి డోర్ పగలగొట్టారు. లోపలికి వెళ్లేసరికి పవన్ మర్మాంగాలపై తీవ్రగాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్నాడు. పక్కనే అతడి పెంపుడు కుక్క ఉండగా దాని నోరంతా రక్తంతో నిండి ఉంది. దీంతో పెంపుడు కుక్కనే పవన్ ప్రైవేటు పార్ట్స్ పై దాడి చేసిందని పోలీసులు అనుమానిస్తున్నారు. పవన్‌కు గతంలో వివాహం జరగ్గా భార్యతో విడాకులు తీసుకున్నాడు. అతడి స్నేహితుడు సందీప్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Next Story