Breaking News : ఒరిస్సా గంజాయి లేడీ డాన్‌ అరెస్టు

by Muthe.Rajitha |

ఒరిస్సా(Odisha)కు చెందిన గంజాయి(Ganja) లేడీ డాన్ సంగీతా సాహు(Sangitha Sahu)ను అలియాస్‌ గీతా సాహును బుధవారం తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు.

Breaking News : ఒరిస్సా గంజాయి లేడీ డాన్‌ అరెస్టు
X

దిశ, వెబ్ డెస్క్ : ఒరిస్సా(Odisha)కు చెందిన గంజాయి(Ganja) లేడీ డాన్ సంగీతా సాహు(Sangitha Sahu)ను అలియాస్‌ గీతా సాహును బుధవారం తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒరిస్సాలోని కుర్థా జిల్లా కాళీకోట్‌ గ్రామానికి చెందిన సంగీతా సాహు గత నాలుగు సంవత్సరాల నుంచి గంజాయి అక్రమ వ్యాపారం చేస్తోంది. భువనేశ్వర్‌కు దగ్గరగా ఉండడంతో అనేక రాష్ట్రాల గంజాయి వ్యాపారులకు గంజాయిని సరఫరా చేస్తూ.. పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతోంది. తెలంగాణలో ఐదు కేసుల్లో నిందితురాలిగా ఉన్న సంగీతా సహును అరెస్టు చేయడానికి ప్రత్యేక టీమ్‌ను ఒరిస్సాకు స్థానిక పోలీస్‌ల సహకారం తీసుకొని సంగితా సాహును అరెస్టు చేసి నగరానికి తీసుకు వచ్చారు. ధూల్‌పేట్‌(Dhoolpeta)లో శీలాబాయ్‌, నేహబాయ్‌, ఇష్‌కాసింగ్‌తోపాటు మరి కొంత మందికి గంజాయిని సరఫరా చేసినట్లు పట్టుబడిన గంజాయి నిందితులు ఇచ్చిన వాగ్మూలంతో సంగీతపై ధూల్‌పేట్‌ ఎక్సైజ్‌ పోలీసులు కేసులు నమోదు చేశారు. కాగా సంగీతా సాహును ఒరిస్సాకు వెళ్లి అరెస్టు చేసి తీసుకు వచ్చిన టీమ్‌ను ఎన్‌ఫోర్స్మెంట్‌ డైరెక్టర్‌ వి.బి.కమలాసన్‌రెడ్డి అభినందించారు.

Next Story