- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రియాజ్ ప్రాణాలతోనే ఉన్నాడు.. ఎన్‌కౌంటర్‌పై NZB సీపీ ప్రకటన
నిజామాబాద్ జిల్లా సారంగపూర్ అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్(Encounter) జరిగినట్లు.. రౌడీ షీటర్ రియాజ్(Rowdy sheeter Riyaz) హతం అయినట్లు వార్తలు విస్తృతం అయిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: నిజామాబాద్ జిల్లా సారంగపూర్ అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్(Encounter) జరిగినట్లు.. రౌడీ షీటర్ రియాజ్(Rowdy sheeter Riyaz) హతం అయినట్లు వార్తలు విస్తృతం అయిన విషయం తెలిసిందే. పోలీసులకు చిక్కినట్టే చిక్కి తప్పించుకునే ప్రయత్నంలో ఎన్‌కౌంటర్ చేశారని వార్తల్లో పేర్కొన్నారు. అయితే.. ఈ వార్తలపై తాజాగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘నిందితుడు రియాజ్‌పై ఎలాంటి కాల్పులు జరుపలేదు. ప్రస్తుతం రియాజ్ ప్రాణాలతోనే ఉన్నారు. అదుపులోకి తీసుకున్నాం. తాము అదుపులోకి తీసుకోవడానికి ముందే ఒక వ్యక్తితో గొడవ పడ్డాడు. ఆ గొడవలో రియాజ్‌కు గాయాలు అయ్యాయి. ప్రస్తుతం రియాజ్‌కు చికిత్స అందిస్తున్నాం’ అని సీపీ పేర్కొన్నారు. కాగా, పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు వెళ్లిన సీసీఎస్ కానిస్టేబుల్‌ను రియాజ్ కత్తితో పొడిచి చంపేసిన విషయం తెలిసిందే. నిజామాబాద్‌లో జరిగిన ఈ ఘటనపై రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy) సీరియస్ అయ్యారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీంతో బృందాలు ఏర్పడి గాలించిన పోలీసులు ఎట్టకేలకు ఇవాళ అదుపులోకి తీసుకున్నారు.






