- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్త తరహా సైబర్ మోసం.. ‘పెళ్లికి రండి’ అంటూ మొబైల్‌కు లింక్
సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) రోజురోజుకు సరికొత్త పంథాలో నేరాలకు పాల్పడుతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) రోజురోజుకు సరికొత్త పంథాలో నేరాలకు పాల్పడుతున్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అనే తేడా లేకుండా అన్ని సోషల్ మీడియా (Social Media) ప్లాట్‌ఫాంలలో సైబర్ నేరగాళ్లు ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేస్తూ అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. ముఖ్యంగా క్యూఆర్ కోడ్స్, ఫేక్ లింకులతో జనం సొమ్మును దొరలా దోచేస్తూ పోలీసులకు సవాలు విసురుతున్నారు. ఈ క్రమంలోనే పొరుగు రాష్ట్రం మహారాష్ట్ర (Maharashtra)లో వినూత్న రీతిలో సైబర్ కేటుగాళ్లు మోసానికి పాల్పడ్డారు. ఓ ప్రభుత్వ ఉద్యోగికి ‘మా పెళ్లికి రండి’ అంటూ క్యూఆర్ కోడ్ ఉన్న లింక్‌ను పంపించారు. అయితే, ఆ లింక్‌ను ఓపెన్ చేయగా.. బాధితుడి బ్యాంక్ అకౌంట్ నుంచి ఏకంగా రూ.2 లక్షలు మాయం అయ్యాయి. దీంతో లబోదిబోమంటూ సదరు ప్రభుత్వ ఉద్యోగి తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.






