ఆన్లైన్ లో గంజాయి రోలింగ్ పేపర్లు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన నెటిజన్

by Muthe.Rajitha |

తెలంగాణ సర్కార్ గంజాయి వంటి డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ.. దానికి పూర్తిగా అడ్డుకట్ట వేయలేకపోతోంది.

ఆన్లైన్ లో గంజాయి రోలింగ్ పేపర్లు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన నెటిజన్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ సర్కార్ గంజాయి వంటి డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ.. దానికి పూర్తిగా అడ్డుకట్ట వేయలేకపోతోంది. గంజాయి అక్రమ రవాణా బయటనే కాకుండా ఆన్లైన్ కు కూడా పాకింది. అయితే గంజాయి రోలింగ్ పేపర్లు ఈ కామర్స్ సైట్లలో కుప్పలుతెప్పలుగా అందుబాటులో ఉండటమే కాకుండా, యువత వాటిని విపరీతంగా కొంటున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై తెలంగాణ పోలీసులకు ఓ నెటిజన్ ఫిర్యాదు చేసారు.

క్యూ-కామర్స్ సైట్ లో గంజాయి కవర్స్ అందుబాటులో ఉండటంపై... డ్రగ్స్ ను అరికట్టాలి అని మీరు నిజంగానే అనుకుంటే 48 గంటల్లో ఈ రోలింగ్ పేపర్లు కొన్నవారి వివరాలు సేకరించి, వారికి డ్రగ్స్ టెస్టులు చేయాలని కోరాడు. దీంతో తెలంగాణ పోలీసులు, నార్కోటిక్స్ టీమ్ వారి వివరాలు సేకరించే పనిలోకి దిగిందని సమాచారం. త్వరలోనే వారందరికీ టెస్టులు చేయనున్నట్టు కూడా తెలుస్తోంది.

Next Story