అధికారుల, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం.. వాహనదారులకు ప్రాణ సంకటం..

by Disha Web Desk 11 |
అధికారుల, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం.. వాహనదారులకు ప్రాణ సంకటం..
X

దిశ, పరిగి: అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల పట్టింపులేని వైనంతో నస్కల్​ సమీపంలోని శాఖర వాగు వంతెన వద్ద వాహనదారులకు ప్రాణ సంకటంగా మారింది. నస్కల్ మీదుగా వికారాబాద్​ జిల్లా కేంద్రానికి వెళ్లే రోడ్డు అధ్వాన్నంగా తయారైందంటూ ‘దిశ’ పత్రిక ఇప్పటికే నాలుగు కథనాలు ప్రచురితం చేసినా.. పల్లెబాటకు వచ్చిన స్థానిక పాలకులు చెప్పినా పెడ చెవిన పెట్టడం వల్లే వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వాహనచోధకులు మండిపడుతున్నారు. పరిగి మండలం నస్కల్​ గ్రామానికి చెందిన ఉదాన బాల్​ రాజ్ (28)​ మోటారు సైకిల్​ పై పరిగి వైపునకు బయలు దేరాడు.

సన్కల్​ గ్రామం నుంచి శివారులోని శాఖర వాగు వద్దకు రాగానే గుంతల రోడ్డు కారణంగా నడి రోడ్డుపై కిందపడ్డాడు. హెల్మెట్​ ధరించకపోవడం వల్ల తలపగిలి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే 108 అంబులెన్స్​ లో పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి ప్రాథమిక చికిత్సలు నిర్వహించి మెరుగైన వైద్యం కొరకు నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన బాల్​ రాజ్​ కు భార్య అనిత ప్రస్తుతం గర్బవతి, ఒక కూతురు లక్కి ఉంది. ఈ గుంతల రోడ్డు కారణంగా ఇంత మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతూ, ప్రాణపాయ స్థితిలో తీవ్రగాయాల పాలవుతున్నా అధికారులకు కనువిప్పు కలుగకపోవడం నిర్లక్ష్యమేనని కాంగ్రెస్​ నాయకుడు లాల్​ కృష్ణ ప్రసాద్​ ఆరోపించారు. కొత్త రోడ్లు ఎలాగో వేయడం లేదని గుంతలు పడిన రోడ్డుపై కాస్త మట్టి అయినా పోయాలని కోరుతున్నారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్​ఐ పి.విఠల్​ రెడ్డి తెలిపారు.





Next Story

Most Viewed