చిట్యాల ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం.. గర్భిణి మృతి

by Bhanu |

చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం మరో ప్రాణాన్ని బలితీసుకుంది. టేకుమట్ల మండలం రామకృష్ణాపురం

చిట్యాల ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం.. గర్భిణి మృతి
X

దిశ, చిట్యాల : చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం మరో ప్రాణాన్ని బలితీసుకుంది. టేకుమట్ల మండలం రామకృష్ణాపురం గ్రామానికి చెందిన సరోజన అనే గర్భిణి మహిళను లో బిపి (Low BP)తో హుటాహుటిన స్థానిక సివిల్ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో తీసుకొచ్చారు. ఆసుపత్రి చేరిన వెంటనే ఆమెకు ఆక్సిజన్ సప్లై చేయగా ఆరోగ్యం మరింతగా విషమించిందని సాక్షులు తెలిపారు.

పేషెంట్ ఆసుపత్రి గదిలో కొద్ది క్షణాల ముందు నుంచి అరుస్తూ ఉండగా, అప్పటివరకు వైద్యులు, నర్సులు, వార్డు బాయ్, సెక్యూరిటీ సిబ్బంది ఎవరూ కనిపించకపోవడం గమనార్హం. అరగంటకు పైగా ఆలస్యంగా వచ్చేసరికి సరోజన ప్రాణాలు కోల్పోయింది.

ఈ ఘటనపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ తీవ్రంగా స్పందిస్తూ, ఇది స్పష్టమైన వైద్య సిబ్బంది నిర్లక్ష్యమేనని పేర్కొన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటివి పునరావృతం కాకుండా ఆసుపత్రిలో నిబంధనల అమలు పట్ల జిల్లా యంత్రాంగం సీరియస్‌గా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్‌కి, పోలీసులకు విజ్ఞప్తి చేశారు.


Next Story