విజయవాడలో దారుణం.. 10 రూపాయాల కోసం హత్య చేసిన బాలుడు

by Ajay Maddhiboyina |   (  Updated:2025-12-19 06:04:21  IST  )

విజ‌య‌వాడ‌లో దారుణం చోటు చేసుకుంది. న‌గ‌రంలోని చిట్టి న‌గ‌ర్ లో పది రూపాయ‌లు అడిగితే ఇవ్వ‌లేద‌ని తాతాజీ అనే వృద్ధుడిని ఓ బాలుడు హ‌త్య చేశాడు.

విజయవాడలో దారుణం.. 10 రూపాయాల కోసం హత్య చేసిన బాలుడు
X

దిశ, వెబ్ డెస్క్: విజ‌య‌వాడ‌లో దారుణం చోటు చేసుకుంది. న‌గ‌రంలోని చిట్టి న‌గ‌ర్‌లో పది రూపాయ‌లు అడిగితే ఇవ్వ‌లేద‌ని తాతాజీ అనే వృద్ధుడిని ఓ బాలుడు హ‌త్య చేశాడు. బాలుడు మ‌ద్యం తాగేందుకు తాతాజీని రూ.10 అడ‌గ్గా ఇచ్చేందుకు నిరాక‌రించాడు. బాలుడు అప్ప‌డికే మ‌త్తులో ఉండ‌గా డ‌బ్బు ఇవ్వ‌క‌పోవ‌డంతో ఆగ్ర‌హానికి గురై క‌త్తితో పొడిచారు. తీవ్ర‌ర‌క్త‌స్రావమై వృద్ధుడు అక్క‌డిక్క‌డే కుప్ప‌కూలాడు. స‌మాచారం అందిన వెంట‌నే పోలీసులు అక్క‌డ‌కు చేరుకోగా అప్ప‌టికే బాధితుడు చ‌నిపోయాడు.

మృతుడు తాపీ ప‌నులు చేసుకుంటూ జీవ‌నం కొన‌సాగిస్తున్న‌ట్టు గుర్తించారు. ఆయ‌న స్వ‌స్థ‌లం మంగ‌ళ‌గిరి నుక‌ల‌పేట కాగా ఉపాధి నిమిత్తం విజ‌య‌వాడ‌లో ఉంటున్నాడ‌ని పోలీసులు చెప్పారు. హ‌త్య చేసిన అనంత‌రం నిందితుడు స్వ‌యంగా పోలీస్ స్టేష‌న్ కు వెళ్లి లొంగిపోయాడు. కాగా ఈ ఘ‌ట‌న‌ విజ‌య‌వాడ ప‌ట్ట‌ణంలో ఈ ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది. పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని నింధితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేవ‌లం ప‌ది రూపాయ‌ల కోసం హత్య చేయ‌డంతో చుట్టుప‌క్క‌ల‌వారు భ‌యాందోళ‌న చెందుతున్నారు.

Next Story