- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్యాంక్ ఉద్యోగిని హత్య చేసిన యూట్యూబర్.. ఆ రెండింటి కోసమే..
బాధ్యతయుతంగా ఉండాల్సిన ఓ యూట్యూబర్ దారుణానికి పాల్పడ్డాడు. డబ్బుల కోసం ఓ నిండు ప్రాణాన్ని తీశాడు.

దిశ,వెబ్ డెస్క్ : బాధ్యతయుతంగా ఉండాల్సిన ఓ యూట్యూబర్ దారుణానికి పాల్పడ్డాడు. డబ్బుల కోసం ఓ నిండు ప్రాణాన్ని తీశాడు. ఉద్యోగిని మచ్చిక చేసుకోని మద్యం తాగించి హత్య చేశాడు. ఆపై అతడి దగ్గర ఉన్న డబ్బు, బంగారాన్ని తీసుకోని పరారీ అయ్యాయి. వరంగల్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
అసలేం జరిగిందంటే..
శుక్రవారం ఉదయం హనుమకొండ శ్రీనగర్ కాలనీలోని రోడ్డుపై ఓ కారు అనుమానస్పదంగా నిలిచి ఉంది. స్థానికులు వెళ్లి చూడగా.. కారులో ఓ వ్యక్తి కాళ్లు, చేతులను తాళ్లతో కట్టేసి ఉన్నాడు. నిశితంగా పరిశీలించగా.. అతడు చనిపోయినట్టు స్థానికులు గ్రహించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగప్రవేశం చేసిన పోలీసులు కారును పరిశీలించి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడిని శ్రీనగర్ కాలనీకి చెందిన బ్యాంక్ ఉద్యోగి వెలుగట్టి రాజా మోహన్‌గా గుర్తించారు. ప్రాథమికంగా లభించిన ఆధారాల ప్రకారం రాజా మోహన్‌ది హత్యగా నిర్ధారించారు.
విచారణను వేగవంతం చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ, కాల్ లిస్ట్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. రాజా మోహన్‌ను డబ్బు, బంగారం కోసమే హత్య చేసినట్టు తేల్చారు. ములుగు జిల్లా(Mulugu District) మంగపేట మండలం కోమటిపల్లికి చెందిన యూట్యూబర్ ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం రాత్రి రాజా మోహన్‌కు జర్నలిస్ట్ మద్యం తాగించి రోకలి బండతో కొట్టి చంపినట్లు వెల్లడించారు. నిందితుడు గతంలో ఓ రాజకీయ పార్టీకి చెందిన కీలక నేత దగ్గర పీఏగా పని చేశాడని తెలిపారు. డబ్బు కోసం పలువురిని బెదిరింపులు, బ్లాక్‌మెయిల్స్ వంటి చర్యలకు పాల్పడ్డారని పోలీసులు వివరించారు.






