అమ్మా.. ఎందుకిలా చేశావ్.. నిద్ర పుచ్చి.. నదిలో పడేసి.. మాతృత్వం అంటే ఇదేనా??

by Sujitha Rachapalli |

రాజస్థాన్‌ అజ్మీర్‌లో దారుణం చోటు చేసుకుంది. మూడేళ్ల పాపను నిద్ర పుచ్చి మరీ నదిలో పడేసి చంపేసింది తల్లి. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ వారణాసికి చెందిన అంజలికి పెళ్లి అయింది. మూడేళ్ల పాప ఉంది. కానీ ఆమె భర్త నుంచి

అమ్మా.. ఎందుకిలా చేశావ్.. నిద్ర పుచ్చి.. నదిలో పడేసి.. మాతృత్వం అంటే ఇదేనా??
X

దిశ, వెబ్ డెస్క్ : రాజస్థాన్‌ అజ్మీర్‌లో దారుణం చోటు చేసుకుంది. మూడేళ్ల పాపను నిద్ర పుచ్చి మరీ నదిలో పడేసి చంపేసింది తల్లి. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ వారణాసికి చెందిన అంజలికి పెళ్లి అయింది. మూడేళ్ల పాప ఉంది. కానీ ఆమె భర్త నుంచి విడిపోయి ప్రియుడితో లివ్ ఇన్ రిలేషన్‌లో ఉంది. కానీ ఆ ప్రియుడికి మొదటి వివాహం నుంచి పుట్టిన బిడ్డ తనతో ఉండేందుకు ఇష్టం లేకపోవడంతో.. ఒత్తిడికి లోనైంది. నిరంతరం విమర్శించడంతో కావ్యను వదిలించుకునేందుకే మొగ్గుచూపుతుంది. ఈ క్రమంలోనే అజ్మీర్‌లోని ఆనా సాగర్ సరస్సు దగ్గర గంటల పాటు(రాత్రి పదిన్నర నుంచి ఒకటిన్నర వరకు) పాపతో గడిపిన అంజలి.. బిడ్డను నిద్ర పుచ్చింది. పడుకున్న పాపను నదిలోకి తోసేసింది.

ఒకటి ఇరవై ఏడు నిమిషాల వరకు బిడ్డ ఆమె ఒడిలోనే ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా తెలిసింది. కానీ ఒకటిన్నర గంటలకు ఒంటరిగానే ఫోన్‌ మాట్లాడుతూ కనిపించింది. కాగా తన బిడ్డ కనిపించట్లేదని.. తప్పిపోయిందని.. పోలీసులను ఆశ్రయించగా.. వివరాలు అడుగుతుండగా ప్రతిసారి మార్చి చెప్పడంతో అనుమానం మొదలైంది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా చేసుకుని దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడింది. గట్టిగా విచారించడంతో నేరాన్ని ఒప్పుకుంది. సరస్సు చుట్టూ నిర్మించిన రైలింగ్ లేని చోటు నుంచి బిడ్డను నదిలోకి తోసేసినట్లు అంగీకరించింది. పాప గురించి వెతికిన పోలీసులు.. సరస్సులో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. ఆమెపై హత్య కేసు నమోదు చేసిన క్రిస్టియన్ గంజ్ పోలీసులు.. అదుపులోకి తీసుకున్నారు.

Next Story