- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో చర్లపల్లి సూసైడ్ మాదిరి ఘటన.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
తిరుపతి జిల్లా పుత్తూరు టౌన్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. కృష్ణానగర్ మూడవ వీధిలో నివాసం ఉంటున్న పద్మ అనే మహిళ తన పిల్లలు తేజ (7), లాస్య(5)తో కలిసి ఆత్మహత్య చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి జిల్లా పుత్తూరు టౌన్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. కృష్ణానగర్ మూడవ వీధిలో నివాసం ఉంటున్న పద్మ అనే మహిళ తన పిల్లలు తేజ (7), లాస్య(5)తో కలిసి ఆత్మహత్య చేసుకుంది. పద్మ ప్రేమ వివాహం చేసుకోగా ఆమె భర్త ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. కాగా వీరు కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం అందుతోంది.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకోగా విచారణ జరుపుతున్నారు. విచారణ తరవాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే రీసెంట్ గా హైదరాబాద్ లోనూ ఇలాంటి ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. విజయారెడ్డి అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తన ఇద్దరు పిల్లలతో కలిసి చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనకు కారణాలు ఏంటనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఇక ఇప్పుడు ఏపీలోనూ తల్లి ఇద్దరు పిల్లలతో ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది.






