నాగ‌ర్ క‌ర్నూలు జిల్లాలో దారుణం..పురుగుల మందు క‌లిపిన అన్నం తిన‌డంతో త‌ల్లి, కూతురు మృతి

by Ratna Kumari |

దిశ, కల్వకుర్తి : నూతన సంవత్సరం వేళ నాగ‌ర్ కర్నూలు జిల్లా లోని కల్వకుర్తి పట్టణంలో గురువారం దారుణం చోటు చేసుకుంది.

నాగ‌ర్ క‌ర్నూలు జిల్లాలో దారుణం..పురుగుల మందు క‌లిపిన అన్నం తిన‌డంతో త‌ల్లి, కూతురు మృతి
X

దిశ, కల్వకుర్తి : నూతన సంవత్సరం వేళ నాగ‌ర్ కర్నూలు జిల్లా లోని కల్వకుర్తి పట్టణంలో గురువారం దారుణం చోటు చేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలకు పురుగుల మందు కలిపిన అన్నం తినిపించి, తాను తిన్న సంఘటన అందరిని కలచి వేస్తోంది. కల్వకుర్తి పట్టణం తిలక్ నగర్ లో నివాసం ఉంటున్న ప్రసన్న (40), తన కుమార్తె మేఘన (13), కుమారుడు అశ్రిత్ కలిసి కేక్ కట్ చేసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. అనంతరం పురుగుల మందు కలిపిన అన్నం తినిపించి.. తాను తిన్నట్లు తెలుస్తుంది. ఈ సంఘటనలో స తల్లి కూతుళ్లు మరణించగా.. కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. తల్లి కూతుళ్ళ మృతదేహాలను ఆసుపత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉన్న కుమారుడి కి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య సేవలు అందిస్తున్నారు. 40 రోజుల క్రితం లావణ్య భర్త భీమ్ శెట్టి ప్రకాష్ మరణించాడు. అతని మరణాన్ని జీర్ణించుకోలేని లావణ్య తాము బతికి ఉండడం కన్నా చావడమే మేలు అని భావించి ముగ్గురు తనువు చాలించాలి అనుకొని పురుగుల మందు కలుపుకొని అన్నం తిని ఈ దురాగతానికి పాల్పడినట్లు తెలుస్తోంది. కాగా ఈ విషయముపై కల్వకుర్తి ఎస్ఐ మాధవరెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story