లెగ్ పీస్ వేయలేదని మైనర్ హత్య

by Sujitha Rachapalli |

ఉత్తరప్రదేశ్ కన్నౌజ్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆహెర్ గ్రామంలో చికెన్ లెగ్ పీస్ కోసం మైనర్ బాలుడిని హత్య చేసిన హృదయ విదారక ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే పెళ్లి తర్వాత భోజనాలు పెడుతుండగా.. పదిహేనేళ్ల బాలుడు అజ్మత్ గెస్ట్‌లకు ఆహారం వడ్డిస్తున్నాడు. అప్పటికే తాగిన మత్తులో

లెగ్ పీస్ వేయలేదని మైనర్ హత్య
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ కన్నౌజ్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆహెర్ గ్రామంలో చికెన్ లెగ్ పీస్ కోసం మైనర్ బాలుడిని హత్య చేసిన హృదయ విదారక ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే పెళ్లి తర్వాత భోజనాలు పెడుతుండగా.. పదిహేనేళ్ల బాలుడు అజ్మత్ గెస్ట్‌లకు ఆహారం వడ్డిస్తున్నాడు. అప్పటికే తాగిన మత్తులో విందుకు వచ్చిన నజీమ్.. అజ్మత్‌ను లెగ్ పీస్ వేయమని అడిగాడు. అయితే తను వడ్డించే బకెట్‌లో లేవని వినయంగా సమాధానమిచ్చాడు అజ్మత్.

ఈ సమాధానంతో రెచ్చిపోయిన నజీమ్ మైనర్ బాలుడిపై చేయి చేసుకోగా.. అజ్మత్ కజిన్ సహీల్ శాంతింపజేసేందుకు ప్రయత్నించాడు. కానీ వినకుండా ఇటుకతో పిల్లాడిని, అడ్డుకున్న సహీల్‌ను బాదాడు. ఇందుకు నజీమ్ స్నేహితులు అర్జున్, వసీమ్ కూడా హెల్ప్ చేశారు. మొత్తానికి ఈ దాడితో పిల్లాడి ఛాతీపై తీవ్ర గాయాలు కావడంతో మరణించగా.. సహీల్ తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు.

Next Story