నీచుడికి నిలువెత్తు నిదర్శనం.. కామకోరికలతో బాలికపై వృద్ధుడి వికృత చేష్టలు..

by Bhanu |   (  Updated:2025-06-10 16:17:42  IST  )

ఓ మైనర్ బాలికను గత మూడేళ్లుగా లైంగికంగా వేధిస్తున్న 73 ఏళ్ల వృద్ధుడిని రాచకొండ పోలీసుల షీ టీమ్స్ అరెస్ట్ చేసింది.

నీచుడికి నిలువెత్తు నిదర్శనం.. కామకోరికలతో బాలికపై వృద్ధుడి వికృత చేష్టలు..
X

దిశ, సిటీక్రైం : ఓ మైనర్ బాలికను గత మూడేళ్లుగా లైంగికంగా వేధిస్తున్న 73 ఏళ్ల వృద్ధుడిని రాచకొండ పోలీసుల షీ టీమ్స్ అరెస్ట్ చేసింది. వివరాల్లోకి వెళ్తే, బాలిక కుటుంబం నివసిస్తున్న ఇంటికి యజమానిగా ఉన్న వృద్ధుడు, తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో బాలికను లైంగికంగా వేధించేవాడు. తల్లిదండ్రులు ఉన్నప్పుడు మాత్రం ఎంతో సంయమనంగా, మర్యాదగా మెలగేవాడు. తీవ్రమైన వేధింపులు భరించలేక బాలిక తన తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పినా వారు విశ్వసించలేదు.


దీంతో బాలిక తానే ప్రత్యక్ష సాక్ష్యంగా మారాలని నిర్ణయించుకుంది. వృద్ధుడు ఇంటికి వచ్చే సమయంలో తన మొబైల్ ఫోన్‌లో వీడియో రికార్డింగ్ పెట్టి, అతని గలీజు చేష్టలను రికార్డ్ చేసింది. అనంతరం ఆ వీడియోను తల్లిదండ్రులకు చూపించింది. వీడియో చూసిన కుటుంబ సభ్యులు షాక్‌కు గురై వెంటనే రాచకొండ షీ టీమ్స్‌ను ఆశ్రయించారు. బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు వృద్ధుడిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు.

Next Story