మెట్రో స్టేషన్ వద్ద బుల్లెట్ కలకలం.. రంగంలోకి పోలీసులు

by Malleboina Mahesh |

రెగ్యులర్ గా ప్రయాణికులను తనిఖీ చేస్తున్న మెట్రో సిబ్బందికి ఉహించని వస్తులు కనిపించాయి.

మెట్రో స్టేషన్ వద్ద బుల్లెట్ కలకలం.. రంగంలోకి పోలీసులు
X

దిశ, వెబ్ డెస్క్: రెగ్యులర్ గా ప్రయాణికులను తనిఖీ చేస్తున్న మెట్రో (Metro) సిబ్బందికి ఉహించని వస్తులు కనిపించాయి. అనుమానం వచ్చి ప్రయాణికుడి బ్యాగ్ చెక్ చేయగా.. ఏకంగా బుల్లెట్ బయటపడ్డాయి. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్‌లోని ముసాపేట్ మేట్రో స్టేషన్ వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శనివారం రాత్రి మహమ్మద్ అనే యువకుడు మూసాపేట్ మెట్రో స్టేషన్‌ (Moosapet Metro Station)కు వచ్చాడు. అయితే సెక్యూరిటీ సిబ్బంది సాధారణ తనిఖీల్లో భాగంగా అతని బ్యాగ్ చెక్ చేయగా.. మహమ్మద్ వద్ద బుల్లెట్ ఉన్నట్లు గుర్తించారు.

వెంటనే అప్రమత్తమైన బ్యాగును పూర్తిగా పరిశీలించగా.. మహమ్మద్ (Mohammed) వద్ద 9 ఎంఎం బుల్లెట్ (9mm bullet) లభ్యం అయింది. దీంతో మెట్రో సిబ్బంది వెంటనే కూకట్ పల్లి పోలీసుల (Kukatpally Police)కు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా ఆ యువకుడు బీహార్ కు చెందిన వాడని.. మూసాపేటలోని ప్రగతి నగర్ లో ఫ్యాబ్రికేషన్ వర్క్ చేసుకుంటూ ఉంటున్నాడని అధికారులు గుర్తించారు.

Next Story