- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భర్తను చంపి ప్రియుడితో లాడ్జ్‌కు సోనమ్..హనీమూన్ మర్డర్ కేసులో వెలుగులోకి సంచలనాలు
మేఘాలయలో హనీమూన్‌కు వెళ్లిన రాజా రఘువంశీ హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: మేఘాలయలో హనీమూన్‌కు వెళ్లిన రాజా రఘువంశీ హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. పెళ్లైన 20 రోజులకు భర్తను హనీమూన్ తీసుకువెళ్లిన సోనమ్ కిరాయి హంతకులతో కలిసి అతి దారుణంగా హత్య చేసింది. తరవాత అక్కడ నుండి పరార్ అయ్యింది. హత్య తరవాత 18రోజుల పాటూ కిడ్నాప్‌కు గురైనట్టు నాటకం ఆడిన సోనమ్ ఎక్కడ ఉంది? ఏం చేసింది? అనే విషయాలు చాలా మందికి ప్రశ్నలా మిగిలిపోయాయి. కాగా పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు బయట పడ్డాయి.
రాజాను హతమార్చిన అనంతరం సోనమ్ కిరాయి హంతకులతో కలిసి 11 కిలోమీటర్లు నడిచింది. ఆ తరవాత గౌహతి వెళ్లి అక్కడ నుండి ట్రైన్‌లో మే 25న ఇండోర్ చేరుకుంది. అక్కడ ప్రియుడు రాజ్ కుశ్వాహా ఆమె కోసం హోటల్ బుక్ చేశాడు. కిరాయి హంతకులు బస చేసేందుకు ఓ ఇంటిని ఏర్పాటు చేశాడు. అంతే కాకుండా తన ప్రియురాలు ఎక్కడ బయపడుతుందో అని రాజ్ కూడా హోటల్‌లో ఆమె పక్క గదినే అద్దెకు తీసుకున్నాడు. ఇక పద్దెనిమిది రోజులుగా ప్రియుడితో కలిసి సోనమ్ ఓకే లాడ్జిలో ఉంది.
ఈ క్రమంలో జూన్ 2న ఉత్తర కాశీ కొండ్లలోని లోయలో రాజా డెడ్ బాడీ లభ్యం కాగా అతడి తలపై పదునైన కత్తితో నరికిన గాయాలు కనిపించాయి. దీంతో పోస్టుమార్టం నివేదికలో హత్య చేసినట్టు తెలిసిందే. హత్యకు వాడిన ఆయుదాలు ఆ ప్రాంతానికి కాకపోవడం, సోనమ్ తీరులో తేడా కనిపించడంతో పోలీసులు ఆమె కాల్ డేటా ఆధారంగా విచారణ జరిపారు. ఎక్కవసేపు ఆమె ప్రియుడితోనే ఫోన్ మాట్లాడినట్టు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని తమ స్టైల్‌లో విచారించగా అసలు నిజాలు బయటపడ్డాయి. ప్రస్తుతం ఇద్దరు అమరప్రేమికులు రిమాండ్‌లో ఉన్నారు. శిక్ష ఖరారు అయితే ఇద్దరూ ఊసలు లెక్కబెట్టాల్సిందే.






