- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కలెక్టర్ ఆదేశాలు: రంగంలోకి రంగారెడ్డి జిల్లా వైధ్యాధికారులు
తెలంగాణ మెడికల్ కౌన్సిల్(Telangana Medical Council) చైర్మన్ డాక్టర్ కే.మహేష్ కుమార్

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మెడికల్ కౌన్సిల్(Telangana Medical Council) చైర్మన్ డాక్టర్ కే.మహేష్ కుమార్, వైస్ చైర్మన్ డాక్టర్ జీ.శ్రీనివాస్ నేతృత్వంలో షాబాద్, హైతాబాద్ ప్రాంతాల్లో గత నెల 30న నిర్వహించిన తనిఖీలో నకిలీ వైద్యులు, నకిలీ ఔషధాలను అక్రమంగా ఉపయోగించి రోగులకు చికిత్స అందిస్తున్న విషయం వెలుగు చూసింది. దీనిని ఓ పత్రిక వెలుగులోకి తీసుకొచ్చింది. దీంతో తక్షణమే చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా ఆరోగ్య, వైద్యాధికారులు ఆ అక్రమ కేంద్రాలను సీజ్ చేశారు:
సీజ్ చేసిన కేంద్రాల వివరాలు :
1. ఓం సాయి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ – లింగాచారి
2. ముస్తాఫా క్లినిక్ – ముస్తాఫా
3. మాస్టర్ క్లినిక్ – వెంకటేశ్
4. శ్రీ సాయి క్లినిక్ – అంజయ్య
5. శ్రవణ్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ – బాలరాజ్
6. జాం జాం క్లినిక్ – మహ్మద్ ఘౌస్ అoజాద్
మరియు మరో 6 ఇతర నకిలీ వైద్య సెంటర్లు సీజ్ చేశారు. అనంతరం ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు. అక్రమంగా వైద్యం చేసే నకిలీ డాక్టర్లు ప్రజారోగ్యానికి తీవ్రమైన ప్రమాదం కలిగిస్తారని.. సరైన వైద్య విద్య, నిబంధనల మద్దతు లేకుండా ఇచ్చే స్టెరాయిడ్లు, యాంటీబయాటిక్స్ వల్ల జీవిత ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉందని.. మీ పరిసర ప్రాంతాల్లో నకిలీ డాక్టర్లు, అనర్హులైన వ్యక్తులు వైద్య సేవలు అందిస్తుంటే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు. వాట్సాప్ నంబర్ 91543 82727కు పంపాలని చె్పపారు.






