- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైవేపై భారీ దారి దోపిడీ.. రూ.10 లక్షల విలువైన సెల్‌ఫోన్లు చోరీ
by Kema Shiva Kumar |
భారీ దారి దోపిడీ జరిగిన ఘటన నిజామాబాద్ (Nizamabad) జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: భారీ దారి దోపిడీ జరిగిన ఘటన నిజామాబాద్ (Nizamabad) జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బ్రాండ్ న్యూ సెల్‌ఫోన్ల లోడ్‌తో ఓ ట్రక్కు హైదరాబాద్ (Hyderabad)కు వెళ్తోంది. ఈ క్రమంలోనే ట్రక్ డ్రవర్ టేక్రియాల్ (Tekriyal) వద్ద విశ్రాంతి తీసుకునేందుకు ఆగాడు. కాసేపు నిద్రపోయి లేచి చూసే సరికి ట్రక్కులో వెనుక వైపు ఉన్న సెల్‌ఫోన్లు ఉన్న డబ్బాలు మాయం అయ్యాయి. దీంతో డ్రైవర్ వెంటనే నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చోరీ గురైన సెల్‌ఫోన్ల విలువ బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ.10 లక్షలకు పైగా ఉంటుందని డ్రైవర్ ఫిర్యాదులో పేర్కొన్నాడు.
Next Story






