రాష్ట్రంలో భారీ అగ్నిప్రమాదం.. అక్కడికక్కడే ఐదుగురి సజీవ దహనం

by Kema Shiva Kumar |

భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) సంభవించిన ఘటన పంజాబ్ (Punjab) రాష్ట్రంలో చోటుచేసుకుంది.

రాష్ట్రంలో భారీ అగ్నిప్రమాదం.. అక్కడికక్కడే ఐదుగురి సజీవ దహనం
X

దిశ, వెబ్‌డెస్క్: భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) సంభవించిన ఘటన పంజాబ్ (Punjab) రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శ్రీ ముక్త్‌సర్ సాహిబ్ (Shri Muktsar Sahib) జిల్లాలోని సింఘవాలి-కోట్లీ రహదారిపై ఉన్న రెండంతస్తుల భవనంలో బాణసంచా తయారీ, ప్యాకేజింగ్ యూనిట్‌లో ఉన్నట్టుండి భారీ పేలుడు సంభవించింది. ఈ బ్లాస్ట్‌లో మొత్తం ఐదుగురు వలస కార్మికులు అక్కడిక్కడే కాలి బూడిదై ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా ఆ రెండంతస్తుల భవనం కుప్పకూలి శిథిలాల కింది కార్మికులు చిక్కుకుపోయారు. ఈ దుర్ఘటనలో మరో 25 మందికి తీవ్ర గాయాలైనట్లుగా లంబి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జస్పాల్ సింగ్ తెలిపారు. ఈ మేరకు రెస్క్యూ బృందాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి.

Next Story