- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. పలువురు కార్మికులు మృతి!
మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లాలో బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది.

దిశ, వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లాలో ఇవాళ పెను విషాదం చోటుచేసుకుంది. ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు (Massive Explosion) సంభవించింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి ఫ్యాక్టరీ భవనం కుప్పకూలడంతో శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకున్నట్లుగా సమాచారం అందుతోంది. దేవాస్ జిల్లాలోని ఖుటెజా గ్రామం సమీపంలో ఉన్న ఒక బాణాసంచా ఫ్యాక్టరీలో ఈ పేలుడు జరిగింది. ఆ పేలుడు శబ్దాలు సుమారు కిలోమీటరు దూరం వరకు వినిపించినట్లుగా సమీప గ్రామస్థులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీ భవనం పూర్తిగా నేలమట్టమవ్వడమే కాకుండా, సమీపంలోని కొన్ని ఇళ్ల కిటికీలు, గోడలు కూడా దెబ్బతిన్నాయి.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఘటన స్థలంలోనే పలువురు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాలు రంగంలోకి దిగాయి. జేసీబీ యంత్రాల సహాయంతో శిథిలాలను తొలగించి, కింద చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, ప్రమాదంలో మృతుల సంఖ్యపై స్పష్టత రావాల్సి ఉంది.






